TG: బీఆర్ఎస్ బృందం సోమవారం ఉదయం 10:30 గంటలకు KRMBని కలవనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఇంటి వద్ద పోలీసుల మోహరించారు. నాగార్జునసాగర్ జలాలను హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఏపీ చేపడుతున్న ‘పల్నాడు వాటర్ గ్రిడ్’ సొరంగ నిర్మాణాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని గులాబీ నేతలు కోరుతున్నారు.