పోలీసుల తనిఖీ.. కానిస్టేబుల్‌పై దూసుకెళ్లిన కారు (వీడియో)

37చూసినవారు
మహారాష్ట్రలోని నవీ ముంబైలోని కళంబోలి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. కారును ఆపేందుకు ప్రయత్నించగా.. కానిస్టేబుల్‌పై ఆ వ్యక్తి దూసుకెళ్లాడు. కానిస్టేబుల్ దిలీప్ భోయ్‌ను కారుతో ఢీకొట్టి 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ దిలీప్ భోయ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్