దిల్జిత్‌ షోకు పోలీసుల అనుమతి

4చూసినవారు
దిల్జిత్‌ షోకు పోలీసుల అనుమతి
ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ దిల్లీ కాన్సర్ట్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 30న జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి భద్రతా కారణాలతో తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ.. నిర్వాహకులతో చర్చల అనంతరం నిర్ణయం మార్చుకున్నారు. భద్రత, ట్రాఫిక్, జనసమూహాల నియంత్రణ కోసం 1,500 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. మరోవైపు, నవంబర్ 27న ముంబయిలో జరగనున్న దిల్జీత్ షో వేదికపై దాడులు చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్