TG: నల్గొండలోని సతీష్ నగర్‌లో ప్రమాదవశాత్తు బావిలో పడిన 38 ఏళ్ల రసమల్ల రంజిత్ కుమార్‌ను పోలీసులు సురక్షితంగా రక్షించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై సైదా బాబు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. తాడు సాయంతో సమన్వయంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితుడిని క్షేమంగా బయటకు తీశారు.