ఈతకు వెళ్లి.. పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

23చూసినవారు
ఈతకు వెళ్లి.. పాలిటెక్నిక్ విద్యార్థి మృతి
AP: విశాఖ జిల్లా ఎస్.రాయవరం గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి ఐజాక్ పెందుర్తి మండలం పినగాడిలో ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో ఎస్.రాయవరం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఐజాక్ తల్లి లక్ష్మి రెండేళ్ల క్రితమే మరణించింది. ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందడంతో తండ్రి ప్రసాద్ పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్