
VIDEO: మొసలికి చికెన్ పెడుతూ.. దానికి చిక్కిన కేర్ టేకర్
పపువా న్యూగినియాలోని పోర్ట్ మోర్స్బీ అడ్వెంచర్ పార్క్లో శనివారం, ఆహారం పెడుతున్న కేర్టేకర్పై మొసలి దాడి చేసింది. మొసలి అతడి కాళ్లను కరుచుకుని నీళ్లలోకి లాగడంతో, ఇతర సిబ్బంది గంట పాటు ప్రయత్నించినా కాపాడలేకపోయారు. నడుము వరకు మొసలి నోట చిక్కుకున్న కేర్టేకర్ను కాపాడేందుకు పోలీసులు మొసలిపై కాల్పులు జరపడంతో అది మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేర్టేకర్ ఆదివారం మరణించారు. మొసలి అతని కాలును తినేసినట్లు అధికారులు తెలిపారు.




