సూర్యుడిపై సంభవించిన రెండు భారీ విస్ఫోటాల ప్రభావంతో ఆదివారం భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకే అవకాశం ఉందని
అమెరికా వాతావరణ సంస్థ (నోవా) అంచనా వేసింది. దీని ప్రభావంతో జీ2 స్థాయి భూఅయస్కాంత తుపాను ఏర్పడవచ్చని తెలిపింది. ఉపగ్రహాలు, రేడియో కమ్యూనికేషన్లు, జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థల పనితీరులో అంతరాయాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా అధిక అక్షాంశ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థల్లో వోల్టేజీ హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉంది. సౌర తుపాను ప్రభావంతో ధ్రువ ప్రాంతాల్లో కనిపించే రంగురంగుల అరోరాలు ఇతర ప్రాంతాల్లోనూ దర్శనమివ్వవచ్చు. అయితే భారత్లో దీని ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా.