ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ మార్చిన ప్రభాస్.. ‘ఫౌజీ’ లుక్‌తో వైరల్!

7575చూసినవారు
ఏడేళ్ల తర్వాత ఇన్‌స్టా డీపీ మార్చిన ప్రభాస్.. ‘ఫౌజీ’ లుక్‌తో వైరల్!
దాదాపు ఏడేళ్ల తర్వాత, 'బాహుబలి' ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ డీపీగా ఉంచిన ప్రభాస్.. తన కొత్త చిత్రం 'ఫౌజీ' పోస్టర్‌ను కొత్త డీపీగా పెట్టారు. 'సలార్', 'కల్కి' చిత్రాలకు కూడా డీపీని మార్చని ఆయన, ఈ సినిమాకు మార్చడంతో, హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి, జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్