TG: 275 ఎస్సై(సివిల్) పోస్టులకు ఆదివారం నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్షలకు అడికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు 1.60 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 335 సెంటర్లలో 10am నుంచి 1pm వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందు నుంచే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. 10am తర్వాత నిమిషం ఆలస్యమైనా, హాల్ టికెట్ పై ఫొటో లేకపోయినా అనుమతించరు.