మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా నాగ్దాలో దారుణ ఘటన జరిగింది. అక్కడ
భారత్ కామర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులపై దారుణంగా కొట్టారు. ఈ దృశ్యాలు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.