దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆరుగురు విదేశీయులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్
విమానం కూలిపోయింది. దావావో డెల్ సుర్ ప్రావిన్స్‌లోని డిగోస్ నగరంలో ఈ ఘటన జరిగినట్లు విపత్తు నిర్వహణ అధికారి జోమర్ కల్లెడో రాయిటర్స్‌కు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.