
నేపాల్ మంచు తుఫానులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు
నేపాల్‌లోని షే-ఫోక్సుండో నేషనల్ పార్క్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆరుగురు భారతీయ పర్యాటకులు భారీ మంచు తుఫాన్లో చిక్కుకుపోయారు. డోల్పా జిల్లాలోని 3,600 మీటర్ల ఎత్తులో ఉన్న సరస్సు ప్రాంతానికి వెళ్లిన ఈ బృందం, గైడ్ల సూచనలను బేఖాతరు చేసినట్లు సమాచారం. మౌమిత హల్దర్, పియాలి కొలే సహా ఈ బృంద సభ్యులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిని రక్షించేందుకు ఆర్మీ హెలికాప్టర్‌ను సిద్ధం చేస్తున్నట్లు డోల్పా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జును ధాకల్ పేర్కొన్నారు.




