
శబరిమల భక్తులకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం
2026-27 మండల-మకరవిళక్కు యాత్ర కోసం కేరళ ప్రభుత్వం, కొచ్చిన్ ఎయిర్పోర్ట్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కలిసి శబరిమల యాత్రికులకు ఆధునిక వసతులు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కొచ్చి నుంచి నీలక్కల్ వరకు హెలికాప్టర్ సేవలు మంగళవారం నుంచి బుకింగ్ ప్రారంభం కానున్నాయి. నవంబర్ 17న 5 వేల చదరపు అడుగుల విశ్రాంతి కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అరవణ ప్రసాదం కోసం వెండింగ్ మెషీన్లు, ఏఐ పార్కింగ్ వ్యవస్థ, పారిశుధ్య ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి.




