ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సామాజిక సేవకురాలు డాక్టర్ నన్నపనేని మంగాదేవి (89) శుక్రవారం కన్నుమూశారు. గత ఆరు దశాబ్దాలుగా గుంటూరు కేంద్రంగా ఆమె విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించారు. 1965లో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ను స్థాపించి, వినూత్న విద్యా విధానాలతో ఎంతోమంది మేధావులను తీర్చిదిద్దారు. 1990లో చేతన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కృషి చేశారు. పిల్లల కోసం సుమారు 25 పుస్తకాలను రచించిన ఆమె సేవలు చిరస్మరణీయం.