విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు

47చూసినవారు
విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
TG: హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో డ్రీమ్ ప్రైడ్ హోటల్‌ కేంద్రంగా విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ దాడులు చేసింది. హోటల్‌ నిర్వాహకులు నిఖిల్, రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితోపాటు విటుడు హర్షిత్ సింఘానియా, ముగ్గురు విదేశీ మహిళలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్