
పెళ్లైన నెల రోజులకే భార్యాభర్తలు ఆత్మహత్య
TG: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్లు ప్రేమించుకుని, పెళ్లైన నెల రోజులకే విభేదాల కారణంగా భార్యాభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎర్రుపాలెంకు చెందిన మహేష్ (25), APలోని ఎన్టీఆర్ జిల్లా బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన నెల రోజులకే మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకునే దశకు చేరుకున్నారు. మనోవేదనతో వెంకటరమణ తన తాతగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, భార్య మరణవార్తతో మహేష్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.




