నవంబర్ 17 నుంచి అట్టహాసంగా పుష్కర్ ఒంటెల జాతర

15చూసినవారు
రాజస్థాన్‌లోని పుష్కర్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన వార్షిక ఒంటెలు, పశువుల జాతర నవంబర్ 17 నుండి 24 వరకు ఘనంగా జరగనుంది. ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలిచే ఈ వేడుక కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతర కోసం సందర్శకులు ఇప్పటికే తరలివస్తున్నారు. ఎడారి అనుభూతిని పొందేందుకు భిల్వారా నుండి వచ్చానని ఒక పర్యాటకుడు తెలిపారు. జాతర ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో పుష్కర్ నగరంలో సందడి నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్