రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో పుతిన్ అధికార యునైటెడ్ రష్యా పార్టీ 57.83% ఓట్లతో విజయం సాధించినట్లు తెలుస్తోంది. 95%కుపైగా ఓట్లు లెక్కించిన తర్వాత ఈ వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 2021లో వచ్చిన 49.8%తో పోలిస్తే ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం పెరిగింది. తాజా ఫలితాల ప్రకారం 450 స్థానాలున్న స్టేట్ డుమాలో యునైటెడ్ రష్యాకు 355 సీట్లు దక్కనున్నట్లు సమాచారం.