బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ప్రముఖ సినీ నటి నయనతారను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నయనతారతో కలిసి దిగిన ఫొటోలను సింధు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇద్దరూ కలసి ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నట్లు ఆమె తన పోస్ట్లో తెలిపారు. ప్రస్తుతం సింధు షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.