ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్ 850 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సంస్థలోని ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, మానవ వనరులు, మార్కెటింగ్ విభాగాల్లోని కొన్ని విధులను కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌కు ఔట్‌సోర్సింగ్ చేయనుంది. ఈ పనులను ప్రధానంగా భారత్‌లోని బృందాలు నిర్వహించనున్నాయి. రానున్న సంవత్సరాల్లో దశలవారీగా ఉద్యోగాల కోత ఉంటుందని, తొలి విడత 2027 మధ్య నాటికి అమలు కానుందని క్వాంటాస్ సీఈవో వెనెస్సా హడ్సన్ తెలిపారు.