
మాల్వాన్లో సిలిండర్ పేలి కుప్పకూలిన రెండంతస్తుల భవనం
ఉత్తర్ప్రదేశ్ మాల్వాన్లో సిలిండర్ పేలుడుతో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సురేశ్ గుప్తా అనే వ్యక్తి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.




