రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం

3చూసినవారు
రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌కి ప్రమాదం
యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమయంలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్