రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు భారీ ఉద్యోగ నోటిఫికేషన్లతో తీపి కబురు అందించనుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో 5,165 పోస్టులను రైల్వే బోర్డు ఆమోదించింది. వీటిలో గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,477, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలున్నాయి. ఇంకా ఎక్కడైనా ఖాళీలుంటే ఈ నెల 26లోపు సమర్పించాలని అన్ని జోన్లను ఆదేశించింది. ఆ వివరాలను సేకరించిన తర్వాత RRB
నోటిఫికేషన్ జారీ చేయనుంది.