బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 9 ఓవర్ల ఆటకు గాను టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన
భారత్ 7.4 ఓవర్లలో 118/5 రన్స్ చేసింది. వర్షం పడటంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్(6) నిరాశపర్చగా.. ఇషాన్(30), నమన్ ధీర్(23) దూకుడుగా ఆడారు. సంజూ(16), శ్రేయస్(22), తిలక్ వర్మ(7) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు కీమో పాల్, స్ప్రింగర్ తలో 2 వికెట్లు, జోసెఫ్ ఒక వికెట్ తీశారు.