పలు జిల్లాలో కురుస్తున్న వర్షం

14చూసినవారు
పలు జిల్లాలో కురుస్తున్న వర్షం
TG: వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు నల్గొండ జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తుంది. త్రిపురారం, నిడమానూరు, చిలుకూరు, వేములపల్లి, కట్టంగూర్, తుంగతుర్తిలో వర్షం పడుతుంది. మద్దిరాల, నూతనకల్, ఆత్మకూరు (ఎస్) మండలాల్లో 8 సెం.మీ. పైగా వర్షపాతం నమోదయ్యింది. అలాగే సూర్యాపేట జిల్లాలోని కోదాడలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా కోదాడలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్