తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన

3చూసినవారు
తెలంగాణలో 8 జిల్లాలకు వర్ష సూచన
TG: హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం కీలక అంచనాను వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనల నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే, ఈ అల్పపీడనం తుఫానుగా మారుతుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. వర్షాల లోటుతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు వాతావరణంలో వస్తున్న ఈ మార్పులపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్