తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. గురు, శుక్రవరాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది