TG: రానున్న రెండు గంటల్లో హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. గంటకు 30-40కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. కాగా ఆసిఫాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.