భారత్ -న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మూడో
టీ20 మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ వేదికైన వెల్లింగ్టన్‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కీలక మ్యాచ్ సమయానికి, సుమారు 87 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానులలో నెలకొంది.