తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల(ఆది, సోమ, మంగళవారం) పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, MBBD, జనగామ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.