ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు భద్రాద్రి, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో వానలు పడొచ్చని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.