TG: మునుగోడు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరుతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నల్గొండలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై, నిధుల కేటాయింపుపై ఆయన చేసిన బహిరంగ విమర్శలు కలకలం రేపాయి. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు, విషయంపై హైకమాండ్‌కు నివేదిక పంపామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. అయితే త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని రాజకీయా వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.