సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.
రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' ఐమాక్స్ ఫార్మాట్లో తెరకెక్కుతోంది. కథలోని విజువల్ ఎలిమెంట్స్, అంటార్కిటికాలోని మంచు కొండలు, రామాయణ ఇతిహాసానికి సంబంధించిన వానర సేనల ఆధారంగా రూపొందించిన భారీ యుద్ధ సన్నివేశాలు ఐమాక్స్లోనే ప్రేక్షకులకు పూర్తి అనుభూతిని అందిస్తాయని
రాజమౌళి తెలిపారు.