‘రాజీవ్‌ యువ వికాసం’ మళ్లీ వాయిదా?

18చూసినవారు
‘రాజీవ్‌ యువ వికాసం’ మళ్లీ వాయిదా?
TG: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువత స్వయం ఉపాధికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను ప్రకటించింది. ఈ పథకం కింద రూ.లక్ష-రూ.4లక్షల వరకు సబ్సిడీతో రుణాలు ఇస్తామని చెప్పింది. ఇందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించారు. కానీ ఇప్పటివరకు అమలు కాలేదు. ఇటీవల Dy.CM భట్టి ‘రాజీవ్‌ యువ వికాసం’ కింద రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. NOV 19 నుంచి రూ.లక్షలోపు సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తొలి విడతలో మంజూరు చేయాలన్నారు. అయినా పథకం అమలులో కదలిక లేకపోవడంతో ఎప్పటికి అమలయ్యేనని ఎదురుచూపులు తప్పడంలేదు.

సంబంధిత పోస్ట్