
ఉప్పొంగుతున్న బాగమతి నది.. పొంచి ఉన్న వరద ముప్పు
ఇటీవల భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌లో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో బాగ్మతి, రోషి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఖాట్మండ్- ఇతర ప్రాంతాలను కలిపే పృథ్వి, బీపీ, కంటి లోక్‌పాత్ హైవేలపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ట్రాఫిక్‌ను మళ్లించారు. సెప్టెంబర్ 25-27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




