సినీ హీరో రామ్చరణ్కు మణికట్టు ఆపరేషన్ విజయవంతమైనట్లు వైద్యులు సోమవారం తెలిపారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో రామ్చరణ్కు గాయమైంది. ఈ క్రమంలో కోయంబత్తూరు గంగా ఆసుపత్రిలో ఆయన సర్జరీ కోసం అడ్మిట్ అయ్యారు. ఆయనకు డాక్టర్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్ అలెజాండ్రో బేడియా తదితర వైద్యుల బృందం ఆపరేషన్ చేసింది.
రామ్చరణ్ కోలుకుంటున్నారని, కొన్ని వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు.