15 కిలోలు తగ్గనున్న రామ్‌చరణ్!

55చూసినవారు
15 కిలోలు తగ్గనున్న రామ్‌చరణ్!
‘రంగస్థలం’ చిత్రంతో హిట్ అందుకున్న నటుడు రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబో మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ‘రంగస్థలం’ కోసం బరువు పెరిగిన చరణ్, ఈ కొత్త చిత్రంలో సన్నగా కనిపించడానికి 15 కిలోల బరువు తగ్గుతున్నట్లు సినీ వర్గాల ద్వారా తెలిసింది. రెండు వారాల క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టులో కనిపించినప్పుడు ఆయన బరువు తగ్గినట్లు స్పష్టమైంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, 2027 చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని సుకుమార్ యోచిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్