‘రామాయణ’ ఫస్ట్ పార్ట్‌ టైటిల్‌ పోస్టర్‌ విడుదల

32చూసినవారు
‘రామాయణ’ ఫస్ట్ పార్ట్‌ టైటిల్‌ పోస్టర్‌ విడుదల
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ టైటిల్‌ను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. హీరో రణ్‌బీర్‌ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. మొదటి భాగానికి ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. అత్యున్నత 3డీ, ఐమ్యాక్స్‌ ఫార్మాట్లలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ దీపావళికి విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్