బాక్సాఫీసు వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న 'రామాయణ' చిత్రాన్ని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గతంలో సోషల్ మీడియాలో క్లిప్స్ వైరల్ అయినప్పుడు మూవీ టీమ్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, తాజాగా సినిమా మొత్తం సోషల్ మీడియాలో లీక్ కావడంతో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఫేస్బుక్ సహా పలు వెబ్సైట్లలో ఈ సినిమా హిందీ వెర్షన్ అక్రమంగా అప్లోడ్ అవుతోంది. ఈ వ్యవహారంపై చిత్ర బృందం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.