'రామాయణ' పార్ట్-1 చిత్రంలో శ్రీరాముడి బాల్యం, సీతారాముల వివాహం, సీతాపహరణ ఘట్టాలను తెరపై ఆవిష్కరించారు. రాముడిగా రణ్బీర్ ఆకట్టుకున్నారు. సీతగా సాయిపల్లవి పర్వాలేదనిపించారు. రావణుడి పాత్రలో యశ్ మెప్పించారు. సినిమాలోని విజువల్స్, కైకేయి-రాముడి మధ్య భావోద్వేగ సన్నివేశాలు, రావణ-జటాయువు పోరాటం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే, ఎక్కువ రన్టైమ్, పాటలు, పాత్రల మధ్య సరైన భావోద్వేగాలు పండకపోవడం సినిమాకు మైనస్. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల నిరాశపరిచింది. రేటింగ్: 3/5