రామాయణ పార్ట్-2.. విడుదల వాయిదా

0చూసినవారు
రామాయణ పార్ట్-2.. విడుదల వాయిదా
రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణం’ రెండో భాగం విడుదల వాయిదా పడింది. తొలుత 2027లో విడుదల చేయాలనుకున్న ఈ చిత్రాన్ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత నమిత్‌ మల్హోత్రా ప్రకటించారు. కథకు గ్రాండ్‌ ఫినాలే అందించేందుకు అదనపు సమయం తీసుకుంటున్నట్లు తెలిపారు. భారతీయ, అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం మొదటి భాగానికి రెండు ప్రత్యేక వెర్షన్లు రూపొందించినట్లు వెల్లడించారు. మూడో భాగం వచ్చే అవకాశంపైనా చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్