
16 నిమిషాలు ఊపిరి బిగబట్టి ధ్యానం చేసిన నటుడు (వీడియో)
తెలుగు, తమిళ సినిమాల్లో విలన్గా పేరుగాంచిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్, హాలీవుడ్లో 'స్ట్రీట్ ఫైటర్' సినిమాతో అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఏకంగా 16 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ధ్యానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పతంజలి యోగసూత్రాల్లోని ఒక ప్రత్యేక సాధనా పద్ధతిని అనుసరించానని, ఇది తన జీవితంలో విజయాలకు దోహదపడిందని, యువతకు కూడా ఈ పద్ధతిని నేర్పిస్తున్నానని విద్యుత్ జామ్వాల్ పేర్కొన్నారు.




