రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ’ దక్షిణాదిలోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. సౌత్ భాషల వెర్షన్ల ద్వారా ఇప్పటివరకు రూ.104.45 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.33 కోట్లు, కన్నడలో రూ.41.2 కోట్లు, మలయాళంలో రూ.12.9 కోట్లు వసూలు చేసింది. దీంతో దక్షిణాదిలో రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా సౌత్‌లో రూ.150 కోట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.