నాలుగు సిరీస్‌లుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ

384చూసినవారు
నాలుగు సిరీస్‌లుగా ‘రణబాలి’ డాక్యుమెంటరీ
టాలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘రణబాలి’. ఇటీవల విడుదలైన ‘ఎందయ్యా సామి’ పాటకు మంచి స్పందన రావడంతో.. మేకర్స్‌ వినూత్న ప్రమోషనల్‌ స్ట్రాటజీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సినిమా గురించి ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేయనున్నారు. మొత్తం నాలుగు ఎపిసోడ్లుగా ఈ సిరీస్‌ రానుందని మేకర్స్ తెలిపారు. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ ఇందులో పాల్గొని.. సినిమా కథ, దాని వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. కాగా, దసరా కానుకగా అక్టోబర్‌ 16న  ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్