
శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్లో బతుకమ్మ వేడుకలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం షేరిగూడలోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులు, కళాశాల యాజమాన్య ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు కలిసి వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణాన్ని నింపింది.






















