
పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రాధాన్యత
గ్రామంలో పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్పంచ్ ఊటు పద్మ మహేందర్ చెప్పారు. కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ పంచాయతీలో గురువారం దసరా పండుగను పురస్కరించుకొని పారిశుధ్య నిర్మూలన పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని అంతర్గత రోడ్లపై చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి వీధులను శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రజలు సహకరించాలని కోరారు.































