
డీఎంహెచ్ఓను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ నిఖిల్ సృజిత్
నూతన రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కల్యాణ్ చక్రవర్తిని శివరాంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ) వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ సృజిత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన పదవి చేపట్టిన డాక్టర్ కల్యాణ్ చక్రవర్తికి ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.





























