Oct 12, 2026, 05:10 IST/
ఢిల్లీ మెట్రోలో సీటు వివాదం.. దాడిలో వ్యక్తి మృతి
Oct 12, 2026, 05:10 IST
ఢిల్లీ మెట్రోలో సీనియర్ సిటిజన్ల సీటు విషయంలో అక్టోబర్ 8న జరిగిన వాగ్వాదం ఒక వ్యక్తి మృతికి దారితీసింది. సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ సమీపంలో పవన్ శర్మ (48)కు, మాజీ ఐఏఎస్ సంజయ్ ప్రతాప్ సింగ్, ఆయన కుమారుడు సిద్ధార్థ్ సింగ్లకు మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది. వాగ్వాదం పెరగడంతో నిందితులు పవన్ శర్మను వెనక్కి తోసేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న ఆయన ఆసుపత్రిలో మృతి చెందారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.