
వెల్జాల్ అభివృద్ధికి నిధులు కోరిన నాయకులు
తలకొండపల్లి మండలం వెల్టాల్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. బుధవారం ఆయనను కలిసి గ్రామంలో ఐ మ్యాక్స్ లైట్లు, సిసి రోడ్లు, భూగర్భడ్రైనేజీ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసమూర్తి, అంబాజీ, తదితరులున్నారు.




































