AP: అనంతపురం జిల్లా రాప్తాడులో స్కూల్ విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యాడు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదురోజుల చికిత్స అనంతరం హేమంత్ పూర్తిగా కోలుకున్నాడు. రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని కర్నూల్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు. అన్ని రకాల వైద్య పరీక్షల అనంతరం ఆయన కోలుకున్నాడు. పోలీసులు ప్రస్తుతం హేమంత్‌ను కర్నూలు నుంచి అనంతపురం తరలిస్తున్నారు.